అధికారం కోసం దురాలోచన చేసే వారిని ప్రజలు గమనించాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. నల్గొండలోని తన నివాసంలో గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘రైతే రాజు పుస్తకం ఆవిష్కరణలో కేవీపీ రామచంద్ర రావు తెలంగాణ మట్టిలో కలిసి పోతానని మాట్లాడారు. తెలంగాణను వ్యతిరేకించి మళ్లీ ఇక్కడ ఆధిపత్యం చేసేందుకు ప్రయత్నాలు. సమైక్య వాదుల కబంధ హస్తాల్లోకి తెలంగాణ పోవద్దు. హైదరాబాద్‌లోనే ఉంటాం.. తెలంగాణకు ద్రోహం, కుట్రలు చేస్తామంటే సహించరు. తెలంగాణపై దండయాత్రలా కేవీపీ, షర్మిల, రేణుకా చౌదరి వ్యాఖ్యలు. జమిలి ఎన్నికలు సాధ్యం కాదనేది అందరికీ తెలుసు.’’ అని గుత్తా చెప్పుకొచ్చారు.
కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో రాజన్న పాలన కంటే వంద రేట్లు ఎక్కువగా తెలంగాణ ప్రజలు, అన్నదాతలు సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. ఇది గమనించాలి. షర్మిల కూడా అవినీతి గురించి మాట్లాడుతుంటే నవ్వు వస్తున్నది. ఆంధ్రలో రాజకీయాలు ఆమెకు చేత కాదు. తెలంగాణను దోచుకోవడం కోసమే షర్మిల కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు. ఆమె మాటల్లో అర్థం పర్థం ఉండదు.