తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీరుపై గువ్వల బాలరాజు అసహనం వ్యక్తం చేశారు. ఇళ్ళ స్థలాల పట్టాల పంపిణీ కి తనను పిలవకపోవడం పై తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై సీరియస్ అయ్యారు గువ్వల బాలరాజు.
కొంత మంది క్రీడాకారులకు జూబ్లీహిల్స్ బంజారహిల్స్ లో ఇళ్ళ స్థలాలు ఇచ్చి, మోగిలయ్య కు బీ ఎన్ రెడ్డి లో స్థలం ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు గువ్వల బాలరాజు. మొగిలయ్య ను ఢిల్లీ తీసుకెళ్లి తెలంగాణ రాష్ట్రంలో అందరికీ తన కళను గుర్తు చేసింది తానని ఈ సందర్భంగా గువ్వల బాలరాజు అన్నారు. ఈ విషయం పై సీఎం కేసిఆర్ దృష్టికి తీసుకెళ్తానని గువ్వల బాలరాజు హెచ్చరించారు.