అబ్బాయిలూ.. గడ్డం దురద పెడుతోందా.? అయితే ఈ చిట్కాలతో చెక్ పెట్టేయండి.!

-

ఒకప్పుడు అబ్బాయిలు గడ్డం పెంచితే..ఏరా బాబూ లవ్ ఫెయిల్ అయిందా, పాప హ్యాండ్ ఇచ్చిందా అనే వాళ్లు..అలా ఫిక్స్ అయి పోయేవాళ్లు కూడా.. కానీ ఇప్పుడు అబ్బాయిలకు గడ్డం పెంచటం అంటే..ఫ్యాషన్ అయిపోయింది. స్టైల్ గా ఉండే ప్రతి అబ్బాయికి మంచి హెయిర్ స్టైల్ ఎంత ముఖ్యమో బియర్డ్ కూడా అంతే ముఖ్యం. అసలు గడ్డం లేకుండా ఉన్న అబ్బాయిలు అంత బాగుండరు..

ఏదో బొచ్చుపీకేసిన కోడిలా వెలితిగా అనిపిస్తారని..చాలా మంది అమ్మాయిల అభిప్రాయం కూడా. అబ్బాయిల్లో యాట్రాక్ట్ గా అనిపించే వాటిల్లో గడ్డం కూడా ఒకటి. ఇక వాళ్లు స్టైల్ గా ఉండటం కోసమో, లేదా వాళ్ల గర్లఫ్రెండ్ ఇష్టం కోసమే.. మొత్తానికి అబ్బాయిలు గడ్డం అయితే పెంచుకుంటున్నారు.. పైకి అందంగా కనిపిస్తుంది కానీ పాపం వారికి గడ్డం ఎక్కువగా ఉండటం వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి తెలుసా..అందులో ముఖ్యంగా దురద.

ఒకసారి గడ్డం దురద మొదలైతే ఉంటంది.. ఎంత చిరాకుగా అనిపిస్తుందో. నలుగురిలో ఉన్నప్పుడు ఊకే దురదపెట్టిదంటే..గీరుకోవాడనికి వారికి ఇబ్బందే..అలా అని ఏమైనా మందులు, ఆయిల్స్ వాడితే..బియర్డ్ లుక్ మారిపోతుంది. లేనిపోని ఇబ్బందులు. ఇవేవి లేకుండా వంటింటి చిట్కాలతో ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చు అబ్బాయిలూ..ఎలానో చూద్దామా..!

నిమ్మకాయ, పెరుగు:

గడ్డం దురద పుట్టకుండా.. ఆరోగ్యంగా ఉండేందుకు మీరు ఇంట్లోనే మాస్క్‌ను సిద్దం చేసుకోవచ్చు. నిమ్మకాయ, పెరుగు కలిపిన పేస్టును గడ్డానికి అప్లై చేసి దాదాపు అరగంట పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో క్లీన్ చేసుకోండి. నిమ్మకాయలో ఉండే విటమిన్ సి గడ్డం మరింత మెరుగ్గా పెరగడానికి సహాయపడుతుంది.

నూనె:

కొన్నిసార్లు గడ్డం దగ్గర చర్మం పొడిబారడం వల్ల దురద పుడుతుంది. ఇందుకోసం వారానికి రెండుసార్లు గడ్డానికి నూనె రాయడం మర్చిపోకండి.. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇలా చేయడం వల్ల దురదను కంట్రోల్ చేయొచ్చు. ఇలా చేయడం వల్ల జుట్టు కూడా మందంగా ఉంటుంది. మార్కెట్‌లో గడ్డానికి మర్దనా చేసే రకరకాల నూనెలు అందుబాటులో ఉన్నాయి. గడ్డానికి సంబంధించిన నూనెను మీరు ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఇంట్లోనే ఆర్గాన్‌ ఆయిల్‌, లెమన్‌ ఆయిల్‌‌ను ఓ సీసాలో వేసి.. రెండింటిని బాగా మిక్స్‌ చేయండి. పూర్తిగా రెండు నూనెలు కలిసిన తర్వాత.. దాన్ని గడ్డానికి రాసుకోవచ్చు..

పరిశుభ్రత:

గడ్డాన్ని ఎప్పుడూ క్లీన్ గా ఉంచుకోవాలి. ప్రతీ రోజూ స్నానంతో పాటుగా ఒక్కసారైనా ఫేస్ వాష్‌తో గడ్డాన్ని శుభ్రపరుచుకోండి. గడ్డంపై ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. లేదంటే దురద, జుట్టు రాలడం, పగిలిపోవడం వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version