దమ్ముంటే రేవంత్ రెడ్డి బీసీ సీఎంను ప్రకటించాలి : జీవీఎల్ నరసింహారావు

-

కేసీఆర్ తెలంగాణను రాజకీయాల కోసం వాడుకునే దాదా చేశారని బీజీపీ ఎంపీ జివిఎల్ నరసింహారావు పేర్కొన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడ లో బిజెపి బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ధరణి పేరుతో దొరికింది అల్లా దోచుకున్నారని ఆరోపించారు. టిఆర్ఎస్ భూ బకాసుర పార్టీ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీ సీఎం నినాదంతో నిశ్శబ్ద విప్లవం మొదలైంది అన్నారు. బీసీలు ఈ అవకాశం వినియోగించుకోవాలని సూచించారు. మళ్లీ వందేళ్లయిన అవకాశం రాదన్నారు. ఊహకు అందని ఫలితాలు వస్తాయన్నారు. దమ్ముంటే రేవంత్ రెడ్డి బీసీ సీఎం ప్రకటన చేయాలని సవాల్ విసిరారు. ముస్లింల కోసం ఐటీ పార్క్ ఇంత దిగజారుడు రాజకీయాలు ఎక్కడ చూడలేదని ఆయన ఎద్దేవ చేశారు. ఈ మాట ఏమైనా దేశాలు వింటే నవ్వుతారన్నారు. బీ ఆర్ఎస్ అవినీతిపై పూర్తిస్థాయి శిక్ష పడాలంటే బిజెపిని గెలిపించాలని జీవీఎల్ నరసింహారావు ప్రజలను కోరారు.

ఢిల్లీ లిక్కర్ స్కాంకు ఇక్కడే బీజం పడిందని.. బిజెపి ఎంపీ మనోజ్ తివారి అన్నారు. లిక్కర్ స్కామ్ లో ముగ్గురు అరెస్టు చేశారని కవిత అరవింద్ కేజ్రీవాల్ కూడా జైలుకు వెళ్తారు అన్నారు అవినీతికి పాల్పడిన వారు ఎవరు తప్పించుకోలేరన్నారు పెట్టుకొని చాటింగ్ చేశారని ఆయన చెప్పారు ఎన్నికల సందర్భంగా తెలంగాణలో తాను అనేక ప్రాంతాల్లో తిరిగానని ప్రజలందరూ ఇదే చెబుతున్నారని లక్ష ఉద్యోగాలు ఎక్కడ అని యువత అడుగుతున్నారన్న నిరుద్యోగ భృతి ఏమైంది అంటూ టిఆర్ఎస్ సర్కారులు ప్రశ్నిస్తున్నారని చెప్పారు మర్చిపోయారని ఏడు లక్షల మందికి ఇల్లు ఇవ్వలేదని పేర్కొన్నారు. టిఆర్ఎస్ కాంగ్రెస్ ఎంఐఎం ఆలోచనలన్నీ ఒకే విధంగా ఉంటాయన్నారు బిజెపి ఎంపీ మనోజ్ తివారి.

Read more RELATED
Recommended to you

Exit mobile version