పవన్ కళ్యాణ్ వద్ద చాలా డబ్బులు ఉన్నాయి : పేర్ని నాని

-

మత్స్యకారుల సంక్షేమం కోసం వైసీపీ ప్రభుత్వం ఏమి చేయలేదని పవన్ కళ్యాణ్ అనడం సరికాదని ఎమ్మెల్యే పేర్ని నాని పేర్కొన్నారు. తమ హయాంలో 10 ఫిషింగ్ హార్బర్లు మంజూరు అయ్యాయని తెలిపారు. బోట్లు దగ్దం ఘటనలో బాధితులకు ప్రభుత్వం రూ.7కోట్ల 11 లక్షల పరిహారం ఇచ్చింది. పవన్ రూ.50వేలు ఇచ్చి రూ.50కోట్లు ఇచ్చినట్టు బిల్డప్ ఇస్తున్నారు. పవన్ తన వద్ద డబ్బు లేదంటున్నారు. కానీ ఆయన వద్ద చాలా డబ్బులు ఉన్నాయి. పవన్ దగ్గర డబ్బులు లేకుంటే చార్టెడ్ ఫ్లైట్ లో ఎలా వస్తాడని ప్రశ్నించారు.


సీఎం జగన్ పై విషం చిమ్మడం పవన్ కి అలవాటుగా మారింది. ఏపీ ప్రజలకు మతిమరుపు చాలా ఎక్కువ అని పవన్ అనుకుంటున్నాడు. మత్య్సకారులకు సీఎం జగన్ ఏమి చేయడం లేదని.. పవన్ పేర్కొంటున్నాడు. సీఎం జగన్ వచ్చాకే 10 ఫిషింగ్ హార్బర్లు మంజూరు అయ్యాయి. శరవేగంగా పనులు జరుగుతున్నాయి. పవన్ నిద్రలేచే సరికే ప్రమాదంలో నష్టపోయిన మత్య్సకారులకు సీఎం జగన్ అండగా నిలిచారు. పవన్ మాటలన్నీ పచ్చి దగాకోరు మాటలు.. పవన్ డబ్బులు ఇచ్చి వెళ్లే సరికే సీఎం జగన్ ప్రభుత్వం రూ.7కోట్ల 11లక్షల పరిహారం ఇచ్చిందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version