జనగామ జిల్లాలో నిన్న కురిసిన వడగళ్ల వాన కారణంగా రైతులకు అపారనష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. వర్ష బీభత్సం కారణంగా వంద ల ఎకరాల్లో పంటలు నేలకొరిగినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పంటలను పరిశీలించారు.
సోమవారం ఉదయం జిల్లాలోని పలు గ్రామాల్లో పర్యటించిన ఆయన పంట నష్టపోయిన రైతులకు ధైర్యం చెప్పారు.పంట నష్టంపై అధికారులతో ఫోన్లో మాట్లాడారు.ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పంట నష్టపోయిన వారికి నష్టపరిహారం అందేలా చేస్తానని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి రైతులకు భరోసా కల్పించారు.