ొాతెలంగాణలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీని స్థాపించి 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రజతోత్సవ సభను గ్రాండ్‌గా నిర్వహించాలని గులాబీ పార్టీ అధిష్టానం భావిస్తున్నది. ఈ క్రమంలోనే వరంగల్ ఎల్కతుర్తి వద్ద భారీ బహిరంగ సభను ఈనెల 27న నిర్వహించనున్నది.
అందుకోసం ఇప్పటికే ఏర్పాట్లను సైతం చేస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మంది జనాభాతో మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. అందుకోసం భారీజనసమీకరణ చేయాలని కేసీఆర్ పార్టీ జిల్లా నేతలకు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సూచించారు. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం తెలంగాణ భవన్‌లో వరంగల్‌లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఆటో సంఘాలు మద్దతు పలికాయి.సభ కోసం రూ.26వేల విరాళం చెక్కును కేటీఆర్‌కు ఆటో డ్రైవర్ల యూనియన్ అందజేసింది.