వేరుశనగపప్పులు ఎంత తింటే ఆరోగ్యానికి అంత మంచిది. కానీ ఉత్తిగా తినమంటే ఏం తింటాం.. మనం ఈరోజు పల్లీలతో హల్వా చేసుకుందామా.. పోషకాలు, రుచితో హెల్తీ అయినా పీనట్ హల్వా ఎలా చేయాలో ఓ సారి చూడండి..!
హై ప్రొటీన్ హల్వా చేయడానికి కావాల్సిన పదార్థాలు
పూల్ మకాన ఒక కప్పు
వేరుశనగపప్పులు ఒక కప్పు
పాలు 250 ML
తేనె ఒక కప్పు
బొంబాయి రవ్వ రెండు టేబుల్ స్పూన్స్
బాదం ముక్కలు రెండు టేబుల్ స్పూన్స్
జీడిపప్పు ముక్కలు రెండు టేబుల్ స్పూన్
పిస్తా ముక్కలు రెండు టేబుల్ స్పూన్స్
వాటర్ మిలాన్ పప్పులు రెండు టేబుల్ స్పూన్స్
మీగడ ఒక టేబుల్ స్పూన్
యాలుకపొడి కొద్దిగా
తయారు చేసే విధానం..
ముందుగా పొయ్యి మీద బాండీ పెట్టి వేరుశనగపప్పులను దోరగా వేయించుకుని చల్లారగా పొడి చేసుకోండి. అలాగే పూల్‌మకానా కూడా వేయించి పొడి చేసుకోండి. రెండు పొడులను హల్వాకి సిద్దం చేసుకొని పక్కన పెట్టుకోండి. ఒక నాన్‌స్టిక్ పాత్రలో జీడిపప్పు, బాదం, పిస్తా, పుచ్చగింజల పప్పు, మీగడ వేసి దోరగా వేయించండి. అందులోనే బొంబాయి రవ్వ వేసి వేగనివ్వండి. ఇవి వేగిన తర్వాత ముందుగా చేసుకున్న పొడులు కూడా వేయండి. రెండు నిమిషాలు కలిపి పావులీటర్ పాలు పోసి.. ఆ పాలల్లోనే ఐదు నిమిషాలు మెల్లగా కలుపుకోండి. ఉండలు లేకుండా చూసుకోండి. అల్వా దగ్గరకు వస్తున్నప్పుడు తేనె వేయండి. బాగా కదుపుకుంటూ.. యాలుకపొడి వేసి.. బాగా తిప్పండి. ముద్దలా వచ్చే వరకూ ఉంచుకుని తీసేయడమే. పైన డ్రైనట్స్ వేసుకుంటే సరి.. ఎంతో రుచికరమైన, హెల్తీ అయినా హై ప్రొటీన్ హల్వా రెడీ.! ఎప్పుడూ సాధారణ హల్వాలే కాకుండా.. ఈ సారి ఈ వెరైటీ హల్వా కూడా ట్రే చేయండి. మనకు ఇష్టమైన రూపంలోనే ఆరోగ్యానికి మేలు చేసేవి చేసుకోవడం చాలా మంచిది.! అలాంటి వాటిల్లో ఇదీ ఒకటీ..!
-Triveni Buskarowthu