కాబోయే భార్యతో ఓ క్యాబ్ డ్రైవర్ చేసిన జోక్ కాస్త ఇద్దరి ఇండ్లల్లో తీవ్ర విషాదం నింపింది.ఐరన్ బాక్స్ వైర్‌ను సరదాగా గొంతుకు చుట్టుకొని కాబోయే భార్యకు క్యాబ్ డ్రైవర్ ఫోటో పంపించాడు. అయితే, కిందికి దిగే సమయంలో ఉరి బిగుసుకోవడంతో మృతి చెందాడు.

ఈ ఘటన కాచిగూడలోని తిలక్‌నగర్‌లో బుధవారం ఉదయం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. తిలక్ నగర్ వాసి అయిన క్యాబ్ డ్రైవర్ ఆదర్శ్(25) తనకు కాబోయే భార్యను ఆటపట్టించడానికి, సోమవారం రాత్రి ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్‌కు ఐరన్ బాక్స్ వైర్‌తో ఉరి వేసుకొని ఫోటో పంపించాడు.కిందికి దిగే సమయంలో ఉరి బిగుసుకుంది.ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో అక్కడికక్కడే మరణించాడు.కాగా, వచ్చే నెల వివాహం ఉండగా ఆదర్శ్ చనిపోవడంతో రెండు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
