నిర్భయ దోషులను వచ్చే నెల 1 న ఉరి తీయనున్న నేపధ్యంలో తీహార్ జైలు అధికారులు పూర్తి స్థాయిలో కసరత్తులు చేస్తున్నారు. డెత్ వారెంట్ కూడా జారీ కావడం ఇక దోషులు కోర్ట్ కి వెళ్ళే అవకాశాలు లేకపోవడంతో ఇప్పుడు అధికారులు ఉరి తీయడానికి సిద్దమయ్యారు. ఈ నేపధ్యంలో తీహార్ జైల్లో వాళ్ళను ఉరి తీసే ప్రదేశంలో డమ్మీ ఉరి తీతలను అమలు చేసారు. అంటే దోషుల ఎత్తు, బరువుకు సమానమైన బరువుగల ఓ బ్యాగ్‌ను ఉరి తీసారు.
వినయ్ శర్మ (26), అక్షయ్ కుమార్ సింగ్ (31), ముఖేష్ కుమార్ సింగ్ (31), పవన్ (26) లను ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం 6 గంటలకు ఉరి తీస్తారు. దీనితో తలారులు ట్రయల్ రన్ కూడా పూర్తి చేసారు. ఉరి తీయడానికి గానూ తాళ్ళను ఉత్తరప్రదేశ్ లోని మీరట్ జైలు నుంచి నుంచి తీసుకొచ్చారు అధికారులు. సోమవారం మధ్యాహ్నం ఒక బ్యాగ్ నిండా గోధుమలు, ఇసుక నింపారు.
దోషి బరువుకి సమానంగా వాటిని నింపిన అధికారులు, ఆ బ్యాగ్ ని ఉరి కొయ్యకు వేలాడదీసారు. ఉరి తాడు సమర్ధవంతమేనా…? సాంకేతిక సమస్యలు ఏమైనా ఉన్నాయా అనే దాని మీద పరిక్షలు చేసారు. ఇక ఈ ప్రక్రియ మరో రెండు సార్లు కొనసాగే అవకాశం ఉంది. ఇక ఇదిలా ఉంటే సోమవారం అక్షయ్ కుమార్ సింగ్ భార్య, తల్లి, మేనల్లుడు అతన్ని కలిసారు. మరోసారి కలిసే అవకాశం కల్పిస్తారు.