ఆ టాలీవుడ్‌ హీరో వేధించేవాడు.. అందుకే : హన్సిక

-

బాల నటిగా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యి కాలక్రమేణా స్టార్ హీరోయిన్‌గా మారిన అందాల భామ హన్సిక మోత్వానీ .రీసెంట్ గా వివాహం చేసుకున్న ఆమె తనకు కాస్టింగ్ కోచ్ అనుభవాలు ఉన్నాయని , రీసెంట్ గా ఓ ఇంటర్వూలో చెప్పుకొచ్చింది. అందులో భాగంగా ఆమె ఓ తెలుగు హీరో పై ఆరోపణలు చేసింది. తెలుగులో ఓ హీరో తనని బాగా ఇబ్బందికి గురి చేశాడని..డేట్‌కి వెళ్దాం వస్తావా అంటూ విసిగించేవాడని చెప్పుకొచ్చింది. అయితే ఆ హీరోకి తగిన రీతిలో తగిన బుద్ది చెప్పానని తెలిపింది.

అయితే, ఆ హీరో ఎవరనే విషయాన్ని మాత్రం హన్సిక వెల్లడించలేదు. దీంతో హన్సికను ఇంతలా ఇబ్బంది పెట్టిన ఆ టాలీవుడ్​ హీరో ఎవరై ఉంటారని.. నెటిజన్లలో కొత్త చర్చ మొదలైంది. ముంబైకి చెందిన ఓ బిజినెస్​ మ్యాన్​ను వివాహం చేసుకున్న హాన్సిక అక్కడే సెటిలైంది. పెళ్లి అయిన తర్వాత కూడా ఈ అమ్మడు సినిమా అవకాశాలు అందుకుంటోంది. కోలీవుడ్ లోనూ ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు. దేశముదురు సూపర్ హిట్ కావడంతో హాన్సికకు తెలుగు సినిమాల్లోనూ వరుస ఆఫర్లు వచ్చాయి. టాప్ హీరోలందరితో హన్సిక నటించింది. తెలుగులో కంటే తమిళ్‌ లో ఎక్కువ సినిమాల్లో ఆడిపాడింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version