Hanuman: ‘హను-మాన్’ మూవీ సరికొత్త రికార్డ్

-

టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ ప్రధాన పాత్రలో వచ్చిన తాజా చిత్రం హనుమాన్ . సంక్రాంతి కానుకగా భారీ అంచనాల మధ్య జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ నుండి బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. కేవలం రూ.75 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిత్రం రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది.ఈ మూవీ సక్సెస్ పై ప్రేక్షకులే కాకుండా ప్రముఖులు ఎంతో మెచ్చుకున్నారు.

తాజాగా ఈ చిత్రం ఇప్పటివరకు ఏ మూవీ నమోదు చేయని మరో అరుదైన రికార్డును అందుకుంది. 92 ఏళ్ల తెలుగు సినిమా చరిత్రలో ‘ఆల్ టైమ్ సంక్రాంతి బ్లాక్బస్టర్’గా ‘హనుమాన్‌’ చరిత్ర సృష్టించింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ ప్రైమ్షో ఎంటర్టైన్మెంట్ అధికారికంగా ట్విట్టర్లో షేర్ చేసింది.ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన మొదటి చిత్రం అయినా ఈ ఫాంటసీ అడ్వెంచర్ 300 కోట్ల గ్రాస్ మార్క్ దిశగా దూసుకుపోతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version