సంక్షేమ పథకాలు ప్రజలకు అందించడంలో రెవెన్యూ ఉద్యోగులది ముఖ్య పాత్ర: పొంగులేటి శ్రీనివాసరెడ్డి

-

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో రెవెన్యూ ఉద్యోగులు అవిరాళంగా కృషి చేస్తున్నారని కొనియాడారు. శుక్రవారం రోజు తెలంగాణ స్టేట్ డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ రూపొందించిన డైరీ నీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ…వీఆర్ఏలు,వీఆర్వోలు ,రెవెన్యూ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు తొందరగానే పరిష్కరిస్తామన్నారు.

రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం శ్రద్ధతో పని చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రమోహన్,ట్రెసా అధ్యక్షుడు వంగా రవీందర్ రెడ్డి,అసోసియేట్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, ఉపేందర్ రెడ్డి వీఆర్వోల సంఘం అధ్యక్షుడు గోల్కొండ సతీష్, వైస్ ప్రెసిడెంట్స్ కే చంద్రకళ, చంద్రయ్య, చంద్రావతి పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version