గ్లామర్ గాళ్ ర‌మ్య‌కృష్ణ‌.. బ‌ర్త్ డే స్పెష‌ల్ .. ఆమె న‌ట‌నే ఓ..రేంజ్

-

అందాల తార ర‌మ్య‌కృష్ణ‌… అందం, అభిన‌యంతో ప్రేక్ష‌కుల మ‌దిలో చెరుగ‌ని ముద్ర వేసుకుంది. నీలాంబరిగా అయినా.. శివగామిగా అయినా ర‌మ్య‌కృష్ణ పోషించే ఏ పాత్ర‌కైనా పూర్తి స్థాయిలో న్యాయం చేసింది. ర‌మ్య‌కృష్ట‌ అందంలోనే కాదు.. నటనలోనూ  సాటి ఎవ్వ‌రూ లేరు. ఆనాటి చిత్రాల్లో తన బికినీ డ్రెస్‌లో గ్లామ‌ర్ షో చేస్తూ.. కుర్రాకారును కన్నార్పకుండా చేసింది. తన హాట్ హాట్ అందాలతో ఆనాటి యూత్‌ను బాగా రెచ్చకొట్టింది. అదే స‌మ‌యంలో లేడీ ఓరియెంటెడ్ పాత్రలు చేస్తూ.. ఇండస్ట్రీలో ఓ రేంజ్ లో దూసుకుపోయింది.

ఈ మ‌ధ్య సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆమె.. ఓ రేంజ్‌లో దూసుకపోతుంది. లాక్‌డౌన్ స‌మ‌యంలో త‌మిళ‌నాడు మాజీ సీఎం, న‌టి జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కిన క్విన్ వెబ్ సిరీస్ లో న‌టించి.. ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుంది. త‌న‌ న‌టన‌తో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లనూ పొందింది.

ర‌మ్య‌కృష్ణ 1970, సెప్టెంబర్ 15న కృష్ణన్, మాయ దంపతులకు జన్మించారు. చిన్న‌త‌నం నుంచి న‌ట‌న‌పై ఆస‌క్తి ఉండేది. దీంతో త‌న త‌ల్లిదండ్రులు భరతనాట్యం, వెస్ట్రన్, కూచిపూడి నృత్యాలను నేర్పించారు. ఆ క్ర‌మంలో దేశ విదేశాల్లో అనేక ప్రదర్శనలు సైతం ఇచ్చింది. అనంత‌రం త‌న పద్నాలుగవ యేటా ‘వెళ్ళై మనసు’ అనే చిత్రంతో తమిళ‌ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అనంత‌రం భ‌లే మిత్రులు అనే చిత్రంతో తెలుగు చిత్ర‌సీమ‌లోకి ఏంట్రీ ఇచ్చింది.

అటు త‌మిళ్, ఇటూ తెలుగులో త‌న నట‌న‌తో మెప్పించింది. ఆమె ఏ పాత్ర చేసిన వంద శాతం న్యాయం చేసేంది ర‌మ్య‌కృష్ణ‌. టాలీవుడ్ అగ్ర‌హీరోలైన ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్​, నాగార్జున, మోహన్ బాబు, రాజేంద్రప్రసాద్, జగపతిబాబు, శ్రీకాంత్, రాజశేఖర్, జూనియర్ ఎన్టీఆర్, మహేశ్​ బాబు, ప్రభాస్​లతో కలిసి నటించారు. 2003లో ప్ర‌ఖ్యాత దర్శకుడు కృష్ణవంశీని పెళ్ళాడింది. వీరికి ఒక కుమారుడు ఉన్నారు. తెలుగు సినిమాకు ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత‌ని తెచ్చింది పెట్టిన సినిమా బ‌హుబ‌లి.

ఈ చిత్రంలో ర‌మ్య‌కృష్ణ న‌ట‌న అదుర్స్‌.. ఇక అప్ప‌టి దాకా న‌టించిన పాత్ర‌ల‌న్నీ ఒక ఎత్తు, బాహుబ‌లిలో శివ‌గామి దేవిగా ర‌మ్య‌కృష్ణ న‌ట‌న మ‌రో ఎత్తు. శివ‌గామి దేవి పాత్ర‌లో న‌టించి, ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌శంస‌లు పొందింది. ‘బాహుబలి 1 చిత్రంలో ఆమె న‌ట‌న‌కు నంది అవార్డు, ఫిలింఫేర్ అవార్డు, సైమా అవార్డు, ఐఫా అవార్డులు వ‌రించాయి. అలాగే ‘బాహుబలి 2 చిత్రానికి గానూ ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డుతో పాటు సైమా అవార్డు కూడా వ‌చ్చింది. ఉత్త‌రాదిన సైతం కొన్ని చిత్రాల‌లో ర‌మ్య న‌టించి మురిపించింది. ఇక ద‌క్షిణాది అన్ని భాష‌ల్లోనూ ఆమె న‌టించి మెప్పించింది.

ప్ర‌స్తుతం.. మెగాహీరో సాయి తేజ్ క‌థ‌నాయ‌కుడుగా న‌టిస్తున్న రిప‌బ్లిక్ చిత్రంలోను ర‌మ్య‌కృష్ణ కీల‌క పాత్ర
పోషిస్తుంది. ఈ చిత్రంలో విశాఖ వాణి అనే పాత్ర‌లో తెర‌పై క‌నిపించనున్న‌ది. ఈ రోజు ర‌మ్య‌కృష్ణ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఆ చిత్ర యూనిట్ ఆమె ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేసింది. ఇందులో ప‌వ‌ర్ ఫుల్ లుక్ లో అద‌ర‌కొడుతుంది. అలాగే .. పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శక‌త్వంలో విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టిస్తున్న లైగ‌ర్ మూవీలో ప్ర‌దాన పాత్ర‌లో న‌టించ‌నున్నారు. భ‌విష్య‌త్ లోనూ ర‌మ్య‌కృష్ణ మ‌రిన్ని పాత్ర‌ల్లో న‌టిస్తూ జ‌నాన్ని మ‌రెంత‌గానో అల‌రిస్తార‌ని ఆశిద్దాం.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version