BIGG BOSS-5 : షన్ను ఫ్యాన్స్ నుండి బెదిరింపులు..దమ్ముంటే అక్కడికి రావాలన్న సరయు..!

-

బిగ్ బాస్ హౌస్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చిన స‌ర‌యు ష‌న్ను పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. ష‌ణ్ణు సిరి చెప్పినట్టు వింటున్నాడ‌ని..వేలిపై సిరి ష‌ణ్ముక్ ను సిరి ఆడిస్తోందని స‌ర‌యు వ్యాఖ్యానించింది. అంతే కాకుండా ఆట ఆడ‌టం లేద‌ని మూల‌కు వెళ్లి కూర్చుంటున్నాడ‌ని ఆరోపించింది. ఇక స‌ర‌యు చేసిన కామెంట్ల‌తో ష‌ణ్ముక్ అభిమానుల నుండి బెదిరింపులు వ‌స్తున్నాయంటూ తాజాగా ఓ వీడియో పోస్ట్ చేసింది.

బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర‌వాత తాను బిగ్ బాస్ గురించి మాట్లాడ‌కూదని అనుకున్నా అని కానీ వాళ్లు చేసే మెసేజ్ ల వ‌ల్లే వీడియో చేస్తున్నా అని చెప్పింది. ఇక తన‌ను బూతులు తిడుతున్నార‌ని. సింగ‌రేణి కాల‌నీలో చిన్నారిని అత్యాచారం చేశార‌ని ఆ చిన్నారి కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించేందుకు తాను వెళుతున్నా అని స‌ర‌యు తెలిపింది. త‌న‌ను తిడుతున్న వాళ్లకు ద‌మ్ముంటే అక్క‌డకు వ‌చ్చి చిన్నారి కుటుంబానికి ధైర్యం చెప్పాల‌ని స‌రయు స‌వాల్ చేసింది. దీనిపై తాను ఓ వీడియోను కూడా పోస్ట్ చేస్తాన‌ని స‌ర‌యు స్ప‌ష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version