శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ సినిమాలలో హ్యాపిడేస్ కూడా ఒకటి. ఈ సినిమా చూసిన తరవాత చాలా మంది కుర్రాళ్లు ఇంజనీరింగ్ బాట పట్టారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు. కాలేజీలో ఉండే లవ్ ఎమోషన్స్, గొడవలు , ఫ్రెండ్ షిప్ ఇలా అన్ని ఎమోషన్స్ ను కండ్లకు కట్టినట్టు చూపించాడు శేఖర్ కమ్ముల. ఇక ఈ సినిమాలో నటించిన పలువురు ప్రస్తుతం గుర్తింపు ఉన్న హీరోయిన్స్ గా హీరోలుగా మారిపోయిన సంగతి తెలసిందే.
ఈ చిత్రంలో నటించిన తమన్నా స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది. ఇప్పటికీ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. అంతే కాకుండా వరుణ్ సందేశ్ కూడా మంచి అవకాశాలు దక్కించుకుని హీరోగా రానిస్తున్నాడు. అదే విధంగా హీరో నిఖిల్ కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇక ఈ చిత్రంలో నటించిన మరికొందరు నటీనటులు మాత్రం సినిమా అవకాశాలు రాక వేరే దారి చూసుకున్నారు. వారిలో నిఖిల్ కు గర్ల్ ఫ్రెండ్ గా నటించిన అప్పు కూడా ఒకరు.
అప్పు అసలు పేరు గాయత్రి రావు. ఆమె తల్లి దండ్రులు కూడా నటీనటులే కావడం విషేషం. గాయత్రి రావు తల్లి బెంగుళూరు పద్మగా ఎంతో పాపులారిటీ సంపాదించుకుంది. ఇక గాయత్రి రావు హ్యపిడేస్ సినిమా తరవాత మళ్లీ ఆరెంజ్, గబ్బర్ సింగ్ సినిమాలో నటించింది. గబ్బర్ సింగ్ లో శృతి హాసన్ ఫ్రెండ్ గా నటించి గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఇక ప్రస్తుతం గాయత్రి రావు సినిమాలకు దూరంగా ఉంటోంది. అంతే కాకుండా పెళ్లి చేసుకుని భర్తతో చెన్నై లో ఉంటున్నట్టు సమాచారం.