దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. మరోవైపు కొత్త వేరియంట్లు భయపెడుతున్నాయి. ఇప్పటికే దేశంలో పలు రాష్ట్రాల్లో ఏ.వై 4.2 కరోనా వేరియంట్ భయపెడుతోంది. దీంతో వ్యాక్సినేషన్ ప్రోగ్రాంను మరింత వేగం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దేశంలో ఇప్పటికే రికార్డ్ స్థాయిలో కరోనా వ్యాక్సిన్ డోసులను అందించారు. దాదాపుగా 104 కోట్ల డోసులను దేశ ప్రజలకు అందించారు. తాజాగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత వేగం పెంచేందుకు కేంద్రం ’హర్ ఘర్ దస్తక్ ‘ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది.
అందరికి వ్యాక్సిన్ అందేలా కేంద్రం’ హర్ ఘర్ దస్తక్‘ ప్రోగ్రాం
-