మళ్లీ పెళ్లిచేసుకున్న హార్దిక్ పాండ్యా.. ఫొటోలు వైరల్

-

టీమ్​ ఇండియా స్టార్ ప్లేయర్, T20 జట్టు కెప్టెన్‌, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య మరోసారి పెళ్లి చేసుకున్నాడు. అదేంటి ఇప్పటికే ఈ ప్లేయర్​కు పెళ్లయి ఓ బాబు కూడా ఉన్నాడనుకుంటున్నారా.. నిజమే. అయితే ఈ ఆటగాడు పెళ్లి చేసుకుంది తన సతీమణి నటాషా స్టాంకోవిచ్​నే. మంగళవారం రాత్రి సుమారు 7 గంటల సమయంలో ఉదయ్​పుర్​లోని ఓ విలాసవంతమైన రాఫెల్స్ హోటల్‌లో ఒక్కటయ్యారు. మూడేళ్ల క్రితమే వీరి వివాహం జరిగినా అది సింపుల్​గానే జరిగింది.

అందుకే వాలంటైన్స్​ డే సందర్భంగా ఈ జంట గ్రాండ్​గా పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. క్రైస్తవ సంప్రదాయం ప్రకారం.. పెద్దలు, సన్నిహితుల సమక్షంలో ఒక్కటయ్యారు. ఉదయ సాగర్ లేక్​ నడుమ నిర్మించిన ఈ విలాసవంతమైన భవనంలో జరిగిన వేడుకకు ఇరు కుటుంబాలతో పాటు పలువురు సినీ, క్రీడా ప్రముఖులు కూడా హాజరయ్యారు. కొత్త జంటకు అభినందనలు తెలుపుతూ దీవించారు. ఈ జంట అభిమానుల కోసం తమ పెళ్లి ఫొటోలను ఇన్​స్టాగ్రామ్​ వేదికగా షేర్ చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version