వెస్టిండీస్ తో చిట్ట చివరి అయిన ఐదో టీ 20 మ్యాచ్ లోనూ టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. అమెరికాలోని ఫోరిడాలో జరిగిన ఐదో టీ 20 లో టీమిండియా ఏకంగా 88 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవరల్లో ఏకంగా 7 వికెట్లు కోల్పోయి 188 పరుగుల భారీ లక్ష్యాన్ని విండీస్ ముందు ఉంచింది.ఇక లక్ష్య ఛేధనకు దిగిన విండీస్ కేవలం 100 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో టీమిండియా 88 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది.
ఇక ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన పాండ్యా సంచలన వ్యాఖ్యలు చేశారు. టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు అందుకోవాలనుకుంటున్నావా అని యాంకర్ అడిగిన ప్రశ్నకు మొహామాటం లేకుండా సమాధానం ఇచ్చాడు పాండ్యా. నేను నా కెప్టెన్సీ బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించాను. టీమిండియా సారథిగా అవకాశం వస్తే సంతోషంగా స్వీకరిస్తాను. అందులో సందేహామే లేదు అని పాండ్యా పేర్కొన్నారు. ఆటలో పట్టుదల, క్రమ శిక్షణ చాలా అవసరమని వెల్లడించారు. వరల్డ్ కప్ లో గెలవాలనే కసితో ఆడుతున్నానని చెప్పారు పాండ్యా.