ఇక సెలవు: గుజరాత్ కు హార్దిక్ పాండ్య ఎమోషనల్ నోట్..!

-

నిన్న జరిగిన రిటెన్షన్ మరియు రిలీజ్ ప్రక్రియలో భాగంగా అన్ని ఐపీఎల్ టీం లు కూడా తమ తమ జట్లలోని ఆటగాళ్లను కొందరిని ఉంచుకుని మరికొందరిని వదిలివేయగా, కొందరు ఆటగాళ్లను మాత్రం స్వాప్ చేసుకోవడం జరిగింది, వారిలో చాలా ముఖ్యమైన స్వాప్ గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య ను ముంబై ఇండియన్స్ దక్కించుకుంది. ముంబై ఆల్ రౌండర్ కెమరూన్ గ్రీన్ ను గుజరాత్ కు ఇస్తూ హార్దిక్ ను తీసుకుంది. ఈ విషయం గురించి స్పందిస్తూ హార్దిక్ పాండ్య ఒక ఎమోషనల్ నోట్ ను పంచుకున్నాడు. గుజరాత్ టైటాన్స్ మానేజ్ మెంట్ కు, టీం కు, ఫ్యాన్స్ కు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేశాడు. ఇక ఈ జట్టులో భాగం అయినందుకు కెప్టెన్ గా ఉన్నందుకు గర్వపడుతున్నాను అంటూ హార్దిక్ ఎమోషనల్ గా ఫీల్ అవుతూ ఈ నోట్ ను పంచుకున్నాడు.

మీరు నాపై పంచిన ప్రేమకు, అభిమానానికి నేనెప్పుడూ రుణపడి ఉంటాను అంటూ తెలిపాడు హార్దిక్ పాండ్య. మరి ముంబైకు వెళుతున్న హార్దిక్ అక్కడ కూడా రాణించి టైటిల్ ను అందిస్తాడా చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version