HariHaraVeeraMallu 1st Single Promo Out Now:పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పాన్ ఇండియా సినిమాల్లో ‘హరిహర వీరమల్లు’ మూవీ ఒకటి. నాలుగేళ్ల క్రితమే ఈ చిత్రం ప్రారంభించినా.. పవన్ కల్యాణ్ డేట్స్ కుదరకపోవడం వల్ల ఇంకా పూర్తి కాలేకపోయింది. ఈ కారణంగానే చిత్రం నుంచి దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తప్పుకున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే, ఇప్పుడు ఏపీలో ఎన్నికలు పూర్తి కావడంతో తన పెండింగ్ చిత్రాల షూటింగ్స్ పై పవన్ కల్యాణ్ ఫోకస్ పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
‘హరిహర వీరమల్లు’ మూవీ షూటింగ్ కూడా దగ్గరపడుతోందట. అయితే.. ఇలాంటి నేపథ్యంలో.. సంక్రాంతి కానుకగా ‘హరిహర వీరమల్లు’ మూవీ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ ‘హరిహర వీరమల్లు’ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ప్రోమో విడుదల చేశారు. ‘వీరమల్లు’ మాట చెబితే వినాలంటూ ఓ ప్రోమోను వదిలింది. ఇక ఈ ఫస్ట్ సింగిల్‌పూర్తి సాంగ్ ను జనవరి 17వ తేదీ ఉదయం 10.20 గంటలకు రిలీజ్ చేయనున్నారట.