కేంద్రం చెప్పేదొకటి కిషన్ రెడ్డి చేసేదొకటి : హరీష్ రావ్

-

ఇటీవలే సన్న వడ్లను రైతుల వద్ద నుంచి కొనుగోలు చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. ప్రతి ఒక రైతు నుంచి కొనుగోలు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే సన్న వడ్లకు అధిక ధర ఇవ్వాలి అంటూ ఇటీవల తెలంగాణ హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేయడంపై స్పందించిన తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు.

సన్న వడ్లకు అధిక ధర కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర హోం శాఖ మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేయడం హాస్యాస్పదంగా ఉంది అంటూ వ్యాఖ్యానించారు మంత్రి హరీష్ రావు. సన్న వడ్ల కు మద్దతు ధర కంటే ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఇవ్వకూడదు అని కేంద్రం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది అంటూ గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వాన్ని అధిక ధర కేటాయించాలని డిమాండ్ చేసే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముందుగా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖను ఉపసంహరించుకునేలా చేయాలంటూ డిమాండ్ చేశారు మంత్రి హరీష్ రావు.

Read more RELATED
Recommended to you

Exit mobile version