ప్రధాని మోదీ హైదరాబాద్ టూర్ పై బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఇరు పార్టీల నేతలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా మరోసారి మోదీ టూర్ పై మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. ఢిల్లీ నుంచి మోదీ వచ్చి ఒక్క మాటైనా చెప్పారా..? రాష్ట్రం కోసం ఏమైనా మాట్లాడారా..? అని ప్రశ్నించారు. తెలంగాణను చూసి ఢిల్లీ కేంద్ర ప్రభుత్వం ఓర్వడం లేదని ఆయన అన్నారు. మతాల మధ్య చిచ్చు పెట్టి ప్రయోజనం పొందాలని చూస్తున్నారుని విమర్శించారు.
తెలంగాణను చూసి ఢిల్లీ కేంద్ర ప్రభుత్వం ఓర్వడం లేదు: హరీష్ రావు
-