తెలంగాణకు ఒక్క జాతీయ ప్రాజెక్టు ఇవ్వకుండా కేంద్రం తీవ్రమైన అన్యాయం చేసిందన్నారు మంత్రి హరీష్ రావు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరి లేదు, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ లేదని మండిపడ్డారు. ఈడీ, సీబీఐలను అడ్డం పెట్టుకుని కేంద్రం రాజకీయాలు చేస్తుందని ఆరోపించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంతో పోల్చితే gsdp, తలసరి ఆదాయం, ఎగుమతులు, పారిశ్రామికికరణలో బీజేపీ ప్రభుత్వంలో తగ్గిపోయిందన్నారు.
కేంద్రం బడ్జెట్ లో నిధులు తగ్గిస్తే రాష్ట్రం మాత్రం పెంచుతుందన్నారు. కాంగ్రెస్ హయాంలో పెనం మీద పడ్డాం అనుకుంటే బీజేపీ హయాంలో పొయ్యిలో పడ్డట్లుగా ఉందన్నారు. అదాని ఆస్తుల వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. దక్షిణ భారత దాన్యగారంగా తెలంగాణ మారిందన్నారు హరీష్ రావు. మన పంటలు చూసి తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు ధాన్యం కావాలని లేఖలు రాశాయన్నారు.