కాంగ్రెస్ కొడుకులకి అహంకారం నెత్తికెక్కింది: హరీష్ రావు

-

హరీష్ రావు కాంగ్రెస్ కొడుకులకి అహంకారం నెత్తికి ఎక్కి భూమి మీద ఉండటం లేదని, ఎన్నికల్లో ఆ పార్టీని ఓడిస్తే భూమి మీదకి వస్తారని ఆరోపించారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డి నామినేషన్ కి మద్దతుగా వచ్చిన ప్రజలతో మెదక్ రాందాస్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో హరీష్ రావు కాంగ్రెస్ మీద బిజెపి మీద విమర్శలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బాండ్ పేపర్లతో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లోనే ఒక హామీని కూడా సక్రమంగా నెరవేర్చట్లేదు అని అన్నారు.

బాండ్ పేపర్ పరువు సీఎం రేవంత్ రెడ్డి తీసారని దేవుళ్ళని రాజకీయాలకి సీఎం వాడుకుంటున్నాడని విమర్శించారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ నేతల బట్టేబాజ్ మాటలు నమ్మారని అన్నారు. ఎంపీ ఎన్నికల్లో మరోసారి ప్రజల్ని మోసం చేయడానికి దేవుడి మీద ప్రమాణం చేస్తున్నారని అన్నారు ఆగస్టు 15 వరకు ఇచ్చిన హామీలు అమలు చేస్తానన్న సీఎం తనతో చాలెంజ్ కి ముందుకు రావాలని సవాల్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news