నిమ్స్‌లో చికిత్స పొందుతున్న గురుకుల విద్యార్థినికి హరీశ్ రావు పరామర్శ

-

వికారాబాద్‌ జిల్లా తాండూరు గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్‌తో అనారోగ్యం పాలై నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లీలావతి అనే గురుకుల విద్యార్థినిని మాజీ మంత్రి హరీశ్ రావు పరామర్శించారు. ఆయన వెంట ఎల్వోపీ మధుసూదనా చారి, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆనంద్ మెతుకు ఉన్నారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ..

‘తాండూరు గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఈనెల 10న కిచిడీ తిని 15 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వారిని మంచి ఆసుపత్రికి పంపకుండా హాస్టల్‌లో ఉంచి చికిత్స అందించారు. నాలుగు రోజులు గడిచినా వారు ఆరోగ్యవంతులు కాలేదు.దీంతో విద్యార్థిని లీలావతిని నిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.ఆ విద్యార్థిని త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. ప్రభుత్వ నిర్లక్ష్యం అభం, శుభం తెలియని గిరిజన బిడ్డకు శాపంగా మారింది. తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగుల్చుతున్నది. వాంకిడి గురుకుల విద్యార్థులకు చికిత్స అందించడంలో జరిగిన వైఫల్యం ఇక్కడ కనిపిస్తున్నది. మొన్న శైలజ మృతికి ప్రభుత్వం కారణం అయ్యింది. ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో వరుస ఫుడ్ పాయిజన్లు జరిగి విద్యార్థులు ఆసుపత్రుల పాలవుతుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు?’ అని సీఎం రేవంత్ మీద ఫైర్ అయ్యారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version