హరీష్ రావు మరోసారి ఫైర్ అయ్యారు కవిత. హరీష్ రావు అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి నీ కలిసి ఆయనతో కుమ్మక్కు అవలేదా ? అని నిలదీశారు. ఆయన ట్రబుల్ షూటర్ కాదు డబుల్ షూటర్ అని బాంబు పేల్చారు. కాళేశ్వరం అవినీతిలో హరీష్ రావు దే పూర్తి పాత్ర అని మండిపడ్డారు.

హరీష్ రావు దగ్గర అన్ని డబ్బులు ఎక్కడివి ? ఎక్కడినుండి వచ్చాయని నిలదీశారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి తనవద్ద పెట్టుకోవడానికి వ్యూహం పన్నలేదా ? 2009 లో రామన్న ను ఒడిగొట్టడానికి హరీష్ రావు 60 లక్షలు పంపించాడని ఆరోపణలు చేశారు. కేసీఆర్ కుటుంబాన్ని ఒడిగొట్టడానికి విచ్చిన్నం చేయడానికి హరీష్ రావు కుట్రలు చేసింది వాస్తవం అనాన్రు కల్వకుంట్ల కవిత.