జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇతడు సిని నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి చిత్ర పరిశ్రమకు వచ్చాడు. తనదైన నటన, సినిమాలలో సక్సెస్ సాధిస్తున్నాడు. ఇక జూనియర్ ఎన్టీఆర్ త్వరలోనే రాజకీయాల్లోకి రాబోతున్నాడు అంటూ అనేక రకాల వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చినట్లయితే కొడాలి నాని ఆయన వెంట వెళ్లరంటూ వైసిపి నేత పేర్ని నాని అన్నారు. మాజీ మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని కొడాలి నాని వదిలీ పెట్టరని ఇది కచ్చితంగా రాసి పెట్టుకోండి అంటూ పేర్ని నాని చెప్పారు.

పవన్ కళ్యాణ్ ను దూషిస్తున్నారని ప్రతి ఒక్కరు అనుకుంటారు. ఆయన ఏమైనా దేవుడా కేవలం చిరంజీవి తమ్ముడు మాత్రమే. కేవలం కాపులను మాత్రమే కాకుండా ఇతర కులాలను కూడా తన వెంట నడిపిస్తేనే వచ్చే ఎన్నికలలో పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే అవకాశాలు ఉంటాయంటూ నాని ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం పేర్ని నాని మాట్లాడిన ఈ మాటలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. మరి జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారా లేదా అనే సందేహాలు చాలామందిలో ఉన్నాయి. ఈ విషయం పైన జూనియర్ ఎన్టీఆర్ ఏదో ఒక క్లారిటీ ఇవ్వాలని ప్రతి ఒక్కరు కోరుతున్నారు.