హుజురాబాద్‌ ఉప ఎన్నిక ; హరీష్‌ రావు సంచలన నిర్ణయం

-

హుజురాబాద్ నియోజక వర్గం ఉప ఎన్నికల్లో భాగంగా ఇవాళ వీణవంక మండలం మామిడాలపల్లి లో టిఆర్ఎస్ అభ్యర్థి గెలుపు శ్రీనివాస్ యాదవ్ తో కలిసి మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హారీష్‌ రావు కీలక నిర్ణయం తీసుకున్నారు. మామిడాల పల్లి లో 90 శాతం ఓట్లు టిఆర్ఎస్ పార్టీకి పడితే ఆ గ్రామాన్ని దత్తత తీసుకుంటానని ప్రకటించారు హరీష్‌ రావు.

harish rao | హరీష్ రావు

ఎన్నికల తర్వాత కలెక్టర్ ను తీసుకువచ్చి దగ్గరుండి అభివృద్ధి పనులు చేయిస్తానని… ముద్దసాని పేరు నిలబెట్టే విధంగా మామిడాలపల్లి లో కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు. ముద్దసాని తనయుడు కశ్యప రెడ్డి తో మాట్లాడి అభివృద్ధి పనులు చేయిస్తానని… ముద్దసాని దామోదర్ రెడ్డి అంటే మాకు ఎంతో ప్రేమ గౌరవం… ఆ గౌరవం కాపాడతామన్నారు.

తెలంగాణ రాక ముందు రైతులు ఎంతో గోస పడేవారని… దామోదర్ రెడ్డి కాల్వలకు గండి కొడితేనే పొలాలకు నీళ్లు వచ్చేవని చెప్పారు. ఈ ప్రాంత అభివృద్ధికి ఆయన ఎంతో కృషి చేశారని… రైతుల గురించి దామోదర్ రెడ్డి తపన పడ్డారని గుర్తు చేశారు. దామోదర్ రెడ్డి కలలను నిజం చేసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని… సీఎం కేసీఆర్ కృషి ఫలితంగా నేడు వీణవంక మండలంలో గోదావరి జలాలు కాళేశ్వరం జలాలు పరుగులు పెడుతున్నాయని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version