కర్ణాటకలో దారుణం..వాకింగ్ కు వెళ్లిన యువకుడిపై అత్యాచారం..!

-

కర్ణాటక లో దారుణం చోటు చేసుకుంది. వాకింగ్ కి వెళ్ళిన 20 ఏళ్ల యువకుడు పై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన దక్షిణ కన్నడ లోని కబాక గ్రామంలో చోటు చేసుకుంది. కబాక గ్రామానికి చెందిన బాధిత యువకుడు ఉదయాన్నే వాకింగ్ కు వెళ్తానని చెప్పి ఇంటి నుంచి వెళ్లాడు. అయితే వాకింగ్ కు వెళ్ళిన ఆ యువకుడిని తమ కుటుంబంతో పరిచయం ఉన్న అదే గ్రామానికి చెందిన హనీఫ్ అనే వ్యక్తి పలకరించాడు. వాకింగ్ చేసి అలసిపోయినట్టు ఉన్నావు…చెరుకు రసం తాగు అంటూ పక్కకు తీసుకు వెళ్ళాడు.

అనంతరం యువకుడిని పొదల్లోకి తీసుకువెళ్లి సెక్స్ చేయాలంటూ బలవంతం చేసాడు. దానికి యువకుడు నిరాకరించగా అని చంపేస్తానని బెదిరించి అత్యాచారం చేశాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తా అంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత యువకుడు వనికిపోవడంతో తండ్రి ఏమైందని ప్రశ్నించగా జరిగిన విషయం చెప్పాడు. దాంతో ఈ ఘటనపై బాధితుడి తండ్రి స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. నిందితుడు హనీఫ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version