11 లక్షల మంది బాలికలకు హెల్త్ హైజానిక్ కిట్స్ పంపిణీ చేస్తాం – హరీశ్ రావు

-

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రూ.70 కోట్లతో 11లక్షల మంది బాలికలకు హెల్త్ హైజానిక్ కిట్స్ పంపిణీ చేస్తామ న్నారు రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు. ఇంటర్మీడియట్ చదివే విద్యార్థినీలు ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ ఇలా ఏ గ్రూపులోనైనా టాప్ 10లో స్టేట్ ర్యాంకు వస్తే వారికి గోల్డ్ మెడల్ బహుమతిగా ఇస్తానని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పాఠ్యపుస్తకాలు అందించి విద్యను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వమని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల అదనపు తరగతు గదుల నిర్మాణ పనులకు రాష్ట్ర మంత్రి హరీశ్ రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభ సమావేశంలో మాట్లాడారు.

బాలికల హైస్కూలు, బాలికల జూనియర్ కళాశాలకు మౌళిక వసతుల కల్పనకు 2.50 కోట్లు నిధులు కేటాయించినట్లు, వాటిలో రూ.1.50 జూనియర్ బాలికల కళాశాలకు, రూ.1 బాలికల పాఠశాలకు వినియోగిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. అదనంగా మరో రూ.1.50 కోట్లు బాలికల హైస్కూలు, జూనియర్ కళాశాల ఆవరణలో ప్లే గ్రౌండ్ రన్నింగ్ ట్రాక్, బాస్కెట్ బాల్ కోట్, వాలీబాల్ కోట్, ఓపెన్ జిమ్ నిర్మిస్తున్నట్లు మంత్రి తెలిపారు. మొత్తం రూ.4 కోట్లతో బాలికల హైస్కూలు, బాలికల కళాశాలకు అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. కార్పోరేట్ పాఠశాల తరహాలోనే ప్రభుత్వ కళాశాలను తీర్చిదిద్దుతాం.రాష్ట్ర వ్యాప్తంగా మన ఊరు, మన బడి కింద రూ.7300 కోట్లతో ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణకు నిధులు వెచ్చిస్తున్నామన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version