రాష్ట్రవ్యాప్తంగా రెండు లక్షల మందికి పైగా పాడి రైతుల పాల ఉత్పత్తి సహకార సంఘాలుగా ఏర్పడి నడిపే డయిరీ కి ప్రతి రోజు పాలు సరఫరాని చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి 15 రోజులకి పాడి రైతులకి బిల్లులు చెల్లించేది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుండి బిల్లుల చెల్లింపు సకాలంలో జరగట్లేదు. 45 రోజుల పాల బిల్లులు పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది.
45 రోజులకు గాను 80 కోట్లని ప్రభుత్వం పాడి రైతులకి చెల్లించాల్సి ఉంది మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. బ్యాంకులలో మహిళా సంఘాలలో వడ్డీ వ్యాపారుల దగ్గర ఇలా వివిధ మార్గాల ద్వారా అప్పు చేసి రైతులు పశువుల్ని కొనుగోలు చేస్తారు అప్పు కిస్తీలు క్రమం తప్పకుండా కట్టుకోవాలి పశువులకి ఖర్చు కూడా పెట్టాల్సి ఉంటుందని బిల్లులు చెల్లించకపోవడం వలన అనేక ఇబ్బందులు పడతారని లేఖ రాశారు.