హుజూరాబాద్ రాజకీయాలు రోజురోజుకూ రసవత్తరంగా మారుతున్నాయి. మొన్నటి వరకు గంగుల కమలాకర్ వరుసగా హుజూరాబాద్ టీఆర్ ఎస్ నేతలతో చర్చలు జరిపారు. ఈటల వర్గాయులను పిలిచి మాట్లాడి పార్టీ వెంటే ఉండాలంటూ ఒప్పించారు. దీంతో అలర్ట్ అయిన ఈటల రాజేందర్ శామీర్‌పేట నుంచి హుజూరాబాద్‌కు మకాం మార్చారు.
ఈటలను దెబ్బ కొట్టాలంటే హరీశ్‌రావుతోనే సాధ్యమని పార్టీ ఆయనను హుజూరాబాద్ రాజకీయాలకు ఇన్‌చార్జిగా నియమించింది. దీంతో ట్రబుల్ షూటర్ రంగంలోకి దిగారు. మొన్నటి వరకు వ్యూహాలు అందిస్తూ గంగులతో పనులు చేయించారు.
కానీ ఇప్పుడు ఆయన స్వయంగా రంగంలోకి దిగారు. ఈరోజు కమలాపూర్ కీలక నేతలతో చర్చలు జరిపారు. సింగిల్ విండో చైర్మన్ పేరాల సంపత్‌రావు, ఇమ్మడి శెట్టి శ్రీనివాస్, తడక శ్రీకాంత్, మౌటం కుమారస్వామితో మంతనాలు జరిపారు. హరీశ్‌రావు తనదైన మాటలతో వారిని పార్టీ వెంటే నడిచేలా చేశారు. దీంతో ఈటలకు పెద్ద దెబ్బ పడినట్టయింది. ఇంకా కొందరు నేతలతో కూడా హరీశ్‌రావు మంతనాలు జరిపినట్టు తెలుస్తోంది. మరి ఈటలకు అత్యంత సన్నిహితంగా ఉండే హరీశ్‌రావు ఇలా చేస్తుండటం కాస్త అనుమానంగానే ఉంది.