ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో హరీష్ రావు భేటీ

-

ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో మంత్రి హరీష్ రావు భేటీ అయ్యారు. డిసెంబర్ లో అసెంబ్లీ సమావేశాలకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. అయితే కేంద్రం ఆంక్షలతో తెలంగాణకు 40,000 కోట్ల ఆదాయం తగ్గిందని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం వైఖరిని అసెంబ్లీ వేదికగా ప్రజలకు వివరించాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు.

Cm kcr 

బడ్జెట్ ప్రతిపాదనలపై కేంద్ర ఆర్థిక శాఖ సమావేశం అయిన సంగతి తెలిసిందే. ఈ సమావేశానికి మంత్రి హరీష్ రావు దూరంగా ఉన్నారు. కేంద్రం వైఖరికి నిరసనగానే మంత్రి హరీష్ రావు దూరంగా ఉన్నారని టిఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. రానున్న ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ని రూపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కసరత్తుని ప్రారంభించిన నేపథ్యంలో ఈ సమావేశానికి రాష్ట్రాల ఆర్థిక శాఖ మంత్రులతో పాటు, రాష్ట్రాల ఆర్థిక శాఖ కార్యదర్శిలతో కేంద్ర ఆర్థిక శాఖ సమావేశాలు నిర్వహిస్తోంది.

ఈ సమావేశాలలో రాష్ట్రాలకు సంబంధించి బడ్జెట్ కి సంబంధించిన పలు ప్రతిపాదనలను తీసుకుంటారు. అయితే ఈ సమావేశానికి ఏపీ నుంచి మంత్రి బుగ్గన హాజరైనప్పటికీ తెలంగాణ నుంచి మంత్రి హరీష్ రావు హాజరు కాలేదు. దీంతో కేంద్రం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి దూరం మరింత పెరిగినట్లు అయింది. కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టేందుకు డిసెంబర్ లో రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version