రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే అసనీ తుఫాన్ కారణంగా తెలంగాణలో పలు జిల్లాల్లో చిరుజల్లులు పడుతున్నాయి. దీంతో కల్లాల్లో ధాన్యం ఉండటంతో రైతుల్లో ఆందోళన పెరుగుతోంది. దీంతో ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగం చేయాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. తాజాగా ధాన్యం కొనుగోలు విషయంపై మంత్రి హరీష్ రావు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ధాన్యం సేకరణ విషయంలో రైతులకు ఇబ్బందులు రావద్దని..చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.