పొలిటికల్ మెచూరిటీ లేకనే సీఎం మార్చురీ వ్యాఖ్యలు చేసారు. ప్రతిపక్ష నేతల మరణాన్ని కోరుకుంటున్న నీచ బుద్ది రేవంత్ రెడ్డి ది అని హరీష్ రావు అన్నారు. BRS లక్షా 62 వేల ఉద్యోగాలు ఇస్తే, కాంగ్రెస్ 5 వేల ఉద్యోగాలు ఇవ్వలేదు. ప్రభుత్వ కార్యక్రమాలను సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ విమర్శలకు వాడుకోవడం ఆయన దుస్థితి కి నిదర్శనం. ఉద్యోగ నియామక పత్రాలిచ్చే కార్యక్రమంలో రేవంత్ రెడ్డి తన ఉన్మాద ప్రవృత్తిని మరోసారి బయట పెట్టుకున్నారు.
కెసిఆర్ ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లకు నియామక పత్రాలు ఇచ్చుకుంటూ ఇంకెంత కాలం డప్పు కొట్టుకుంటావు రేవంత్ రెడ్డి.. ఏడాదిన్నరగా నువ్వు ఇస్తున్న నియామక పత్రాలు అన్ని కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్లె కదా.. ఈరోజు కూడా కెసిఆర్ గారి ప్రభుత్వ హయంలో ఇచ్చిన పాలిటెక్నిక్ లెక్చరర్, జూనియర్ లెక్చరర్ నోటిఫికేషన్లకు, పెట్టిన పరీక్షలకు నియాక పత్రాలు ఇచ్చినవు. కేసీఆర్ హయం లో మొదలై చివరి దశకు వచ్చిన ఉద్యోగ నియామకాల ప్రక్రియ ను పూర్తి చేసి జబ్బలు చరచుకుంటే బొప్పి కట్టడం తప్ప ఒరిగేదేమి ఉండదు తొమ్మిదిన్నర ఏళ్ల కాలంలో బి ఆర్ ఎస్ ప్రభుత్వం లక్షా 62 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది వాస్తవం. ఏడాదిన్నర కాలంలో నోటిఫికేషన్ల ద్వారా రేవంత్ రెడ్డి ఇచ్చిన ఉద్యోగాలు 5, 6 వేలు మించ లేదనేది వాస్తవం అని హరీష్ రావు తెలిపారు.