పేదలకు అది ఒక వరం : హరీష్ రావ్

-

సీఎం సహాయనిధి ద్వారా ఎంతోమంది నిరుపేదలకు సహాయం చేస్తూ వస్తుంది తెలంగాణ ప్రభుత్వం. ఇటీవలే తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తన నివాసంలో ఏకంగా 17 మంది లబ్ధిదారులకు 611500 రూపాయల విలువ చేసే సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు ఈ సందర్భంగా సీఎం సహాయనిధి పై ప్రశంసల వర్షం కురిపించారు మంత్రి హరీష్ రావు.

సీఎం సహాయనిధి నిరుపేదల పాలిట ఒక వరం లాంటిది అంటూ అభివర్ణించారు తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు. ఎప్పుడూ నిరుపేదల అందరికీ అండగా సీఎం సహాయనిధి నిలుస్తుంది అంటూ వ్యాఖ్యానించారు. ఇటీవలే లబ్ధిదారులకు చెక్కులను అందజేసిన హరీష్ రావు చెక్కులను వెంటనే లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ చేసుకోవాలి అని సూచించారు. ఇక సీఎం సహాయనిధి ద్వారా చెక్కులు అందుకున్న లబ్ధిదారులు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version