గవర్నర్ మహిళ కాబట్టే అవమానిస్తున్నారంటూ.. బీజేపీ వ్యాఖ్యలు చేస్తోందని దీన్ని ఖండిస్తున్నామని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు అన్నారు. అసలు మీరెందుకు గవర్నర్ కార్యాలయానికి కాషాయ రంగు పూస్తున్నారంటూ.. మండిపడ్డారు. మహిళల గురించి మాట్లాడే అర్హత బీజేపీ పార్టీకి గానీ, బండి సంజయ్ కి గానీ లేదని విమర్శించారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వశర్మ దేశంలోని తల్లులను అవమాన పరిచేలా మాట్లాడారని.. ఆ వ్యాఖ్యలను సమర్థించిన బండి సంజయ్ మహిళల గురించి మాట్లాడే అర్హత ఉందా.. ? అని ప్రశ్నించారు.
మహిళల గురించి మాట్లాడే అర్హత బీజేపీకి, బండిసంజయ్ కి లేదు- హరీష్ రావు.
-