
మార్కెట్లకు శివరాత్రి కళ వచ్చింది. పండుగ నేపథ్యంలో ఉమ్మడి మెదక్ పట్టణ కేంద్రాలు, మండల కేంద్రాల్లో పెద్ద సంఖ్యలో పండ్ల దుకాణాలు వేలిశాయి. డిమాండ్ పెరగడంతో వ్యాపారులు ధరలను అమాంతం పెంచేశారు. మొన్నటి వరకు కిలో రూ. 60 ఉన్న ద్రాక్షపండ్లు రూ.100, రూ.40 పలికిన కర్భుజాను కిలో రూ.80, అరటిపండ్లు డజన్ రెట్టిపు ధరకు అంటే రూ.80, పుచ్చకాయ కిలో రూ.30, యాపిల్, దానిమ్మ కిలో రూ.100కి అమ్ముతున్నారు.