ఎన్నికల వేళనే టూరిస్టులు వస్తుంటారు.. ప్రతిపక్షాలపై హరీశ్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు

-

ఎన్నికల వేళనే టూరిస్టులు వస్తుంటారు అని.. నకిలీ హామీలు, వెకిలి చేష్టలు చేయడమే ప్రతిపక్షాల పని అంటూ  ప్రతిపక్షాలపై హరీశ్ రావు విమర్శలు గుప్పించారు. గురువారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ కంటే దేశంలో మెరుగైన పాలన ఎక్కడ ఉందో చెప్పాలన్నారు. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో పొలిటికల్ టూరిస్టులు వస్తుంటారని ఎద్దేవా చేశారు. మొన్న అమిత్ షా, నిన్న ఖర్గే ఇలా వచ్చి పేపర్ పై రాసిచ్చిన హాీలు చదివి వెళ్లారని పేర్కొన్నారు.

వారికి రాష్ట్రంపైన ఎలాంటి అవగాహన లేదన్నారు. తెలంగాణ అభివృద్ధి విషయంలో మాటలు కాకుండా చర్చకు రావాలని సమావేశాలు హరీష్ రావు. వైద్య ఆరోగ్య రంగంలో దేశంలోనే తెలంగాణ మూడో స్థానంలో ఉందన్నారు. తలసరి ఆదాయంలో భారత దేశంలోనే నెంబర్ వన్ గా తెలంగాణ ఉందని చెప్పారు. కేవలం తెలంగాణ రాష్ట్రానికే కాదు దేశానికే అన్నం పెట్టే స్థాయికి రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారని తెలిపారు. ముచ్చటగా మూడోసారి టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని.. రాత్రి కొట్టబోతుందని ధీమా వ్యక్తం చేశారు. మూడోసారి ముఖ్యమంత్రిగా కెసిఆర్ రానున్నారని తెలిపారు. టిఆర్ఎస్ స్లోగన్లు ఇచ్చే పార్టీ కాదు.. సొల్యూషన్ ఇచ్చే పార్టీ అని పేర్కొన్నారు మంత్రి హరీష్ రావు.

Read more RELATED
Recommended to you

Exit mobile version