భారత మహిళా క్రికెటర్ క్యాచ్‌కు ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే..!

-

అంతర్జాతీయ క్రికెట్లో టీ20 ఫార్మాట్ ఎంట్రీ ఇవ్వడంతో… ఆట రూపురేఖలే మారిపోయాయని చెప్పొచ్చు. ఆటగాళ్ళు గతంలోని లేని విధంగా మైదానంలో భారీ హిట్టింగ్, మెరుపు ఫీల్డింగ్, స్టన్నింగ్ క్యాచ్‌లతో అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఇటీవలే కాలంలో మహిళల క్రికెట్ కు కూడా క్రమంగా ఆదరణ పెరుగుతోంది. కాగా మైదానాల్లో విన్యాసాలు పురుషులే కాదు తాము చేయగలమని నిరూపిస్తున్నారు మహిళా క్రికెటర్లు. తాజాగా భారత మహిళా క్రికెటర్‌ (Indian women cricketer‌) హర్లీన్‌ డియోల్‌ క్యాచే దీనికి నిదర్శనం.

భారత మహిళా క్రికెటర్‌/ Indian women cricketer‌

ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో పర్యటనలో భారత మహిళల జట్టు వన్డే సిరీస్‌ ముగించుకొని టీ20 సిరీస్‌ ఆడుతుంది. ఈ సిరీస్‌లో భాగంగా శుక్రవారం రాత్రి జరిగిన తొలి టీ20లో ఇంగ్లాండ్‌ మహిళల జట్టు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసింది. ఈ ఇన్నింగ్స్ 19 ఓవర్లో ఓ అద్భుతమే జరిగిందని చెప్పొచ్చు. శిఖా పాండే వేసిన ఈ ఓవర్లో ఐదో బంతిని అమీ జోన్స్‌ లాంగ్ ఆఫ్ మీదుగా ఆడింది. అయితే బంతి సిక్స్ పోయిందనుకున్న సమయంలో.. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న హర్లీన్‌ డియోల్‌ ఎడమవైపు గాల్లోకి డైవ్‌ చేసి బంతిని అందుకొంది. ఇక బాడీ బ్యాలన్స్ ఔట్ కావడంతో బౌండరీ అవతలకి దూకుతూ బంతిని గాల్లోకి విసిరింది. వెంటనే రెప్పపాటు క్షణంలో మళ్ళీ మైదానంలోకి డైవ్‌ దూకి సురక్షితంగా బంతిని ఓడిసిపట్టింది. అద్భుత క్యాచ్ పట్టిన డియోల్‌ను జట్టు సభ్యులు అభినందించగా.. ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. డియోల్‌ క్యాచ్ చూసిన క్రికెట్ అభిమానులు ఫిదా అవుతున్నారు. అయితే వర్షం కారణంగా ఈ మ్యాచ్ మధ్యలోనే నిలిచిపోగా డక్‌వర్త్‌ లూయిస్‌ విధానంలో ఇంగ్లాండ్‌ విజయం సాధించింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version