కరోనా వైరస్ కారణంగా ఎన్నో సమస్యలతో సతమతమవుతున్నారు. ఒక పక్క వైరస్ వలన బాధపడుతుంటే మరొకవైపు జీవన విధానంలో కూడా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా చెప్పాలంటే విద్యా విధానంలో మార్పులు చాలా ఎక్కువగా ఉన్నాయి.కరోనా వైరస్ వచ్చినప్పటి నుండి కూడా ఆన్లైన్ ఎడ్యుకేషన్ మాత్రమే కొనసాగుతోంది. డాక్టర్లు ఆన్ లైన్ ఎడ్యుకేషన్ వల్ల కలిగే సమస్యలు కూడా చెప్పడం జరిగింది. పిల్లల ఆన్లైన్ ఎడ్యుకేషన్ వల్ల ఎక్కువ సేపు స్మార్ట్ ఫోన్ లేదా ల్యాప్టాప్ ముందు కూర్చుని ఆన్లైన్ క్లాసులు (Online classes) కి అటెండ్ అవుతున్నారు.
అయితే ఇలా చేయడం వల్ల పిల్లల్లో కంటి సమస్యలు వస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. మరి ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే… ఆన్లైన్ క్లాసులు కారణంగా పిల్లలు ఎక్కువసేపు ఎలక్ట్రానిక్ డివైస్ల ముందు ఉంటున్నారు.
దీని కారణంగా కొద్ది రోజుల్లో పిల్లలకి మయోపియా సమస్య వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. కంటి చూపు పై ఇది తీవ్రంగా ప్రభావం చూపిస్తోందని ఎక్కువగా ఆన్లైన్ క్లాసులు వల్ల ఈ సమస్య వస్తుందని అంటున్నారు.
ఇలా కంటి చూపు పై ఇది ప్రభావం పడుతోంది కనుక ఆన్లైన్ క్లాసులు కోసం స్మార్ట్ ఫోన్ ని ఉపయోగించకూడదని చెబుతున్నారు. స్మార్ట్ ఫోన్ తో పోల్చుకుంటే లాప్టాప్ లేదా కంప్యూటర్ మంచిదని వీలైతే టీవీ కి కనెక్ట్ చేసుకోవడం కూడా మంచిదని చెబుతున్నారు.
కానీ స్మార్ట్ ఫోన్ వాడడం వల్ల మయోపియా వంటి సమస్యలు వస్తాయని కంటికి ఎదురుగా స్క్రీన్ ఉంటుంది కాబట్టి పిల్లల కంటి చూపు దెబ్బతింటుందని నిపుణులు చెప్పారు.