నేను చేసిన  అభివృద్ధికి ఎన్ని మార్కులు వేస్తారో మీ ఇష్టం..

-

నాడు తెలంగాణ ఉద్యమంలో, ప్రస్తుత రాష్ట్ర అభివృద్ధిలోనూ ముందున్న సిద్దిపేట మెజారిటీలోనూ ముందుండాలని మంత్రి హరీశ్ రావు ఆకాంక్షించారు.  శుక్రవారం సిద్దిపేటలోని శ్రీనివాస్‌నగర్‌ కాలనీలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మీ కుటుంబ సభ్యుల్లో ఒకడిగా నన్ను ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు..  ‘‘మీ ఆశీస్సులు, దీవెనల కోసం ఇక్కడకు వచ్చా. మీ పిల్లలు పరీక్ష రాస్తే ఫస్ట్ రావాలని ఎలా కోరుకుంటారో.. నాలుగున్నర సంవత్సరాలుగా నేను చేసిన అభివృద్ధి పరీక్షకు ఎన్ని మార్కులు వేస్తారో వేయండి మీ ఇష్టం అంటూ ఆ ప్రాంత ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. హైదరాబాద్ తరహాలో రూ.300 కోట్లతో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం చేసుకుంటున్నాం.

మంత్రిగా ఎన్ని పనులు ఉన్నా శ్రీనివాస్ నగర్ రాముల వారి కళ్యాణంలో ఏటా నేను పాల్గొంటున్నా. ఇక్కడ ప్రజల సమస్యలను ఎన్నింటినో పరిష్కరించాను. మీ కుటుంబ సభ్యుడిగా ఎల్లప్పుడు అందుబాటులో ఉన్నా అంటూ గుర్తు చేశారు. గల్లీ గల్లీకి మిషన్ భగీరథ ద్వారా నీళ్ళు ఇచ్చాం. అలాగే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఆధునిక దోభి ఘాట్లను నిర్మాణం చేసుకున్నాం. కోమటి చెరువు, మినీ స్టేడియం లాంటివి ఎంత అభివృద్ధి చేసుకున్నామో చూశారు. గతంలో కరెంటు ఉంటే వార్తగా ఉండేది…ఇప్పుడు కరెంటు పోతే వార్త అన్నారు. కేసీఆర్ దార్శనికత, తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో నాలుగున్నరేళ్ల పాలనను విజయవంతంగా నిర్వహించాం.. మరో సారి లక్షకు పైగా మెజార్టీ ఇస్తే ఢిల్లీ స్థాయిలో  సిద్దిపేట గురించి చర్చజరగాలన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version