ఎవరినో మనం అనుకరిస్తూ.. రికార్డులు సృష్టించామని చెప్పుకొనే రోజుల నుంచి రాష్ట్రం ఇప్పుడు తనను చూసి పక్కరాష్ట్రాలు అనుసరించే, అనుకరించే రేంజ్‌కు చేరుకుంది. చంద్రబాబు హయాంను ఈ సందర్భంగా చెప్పుకోకుండా.. ఇప్పుడు అసలు ఏం జరుగుతున్నదీ చెప్పుకొంటే ఒకింత అసంతృప్తిగానే ఉంటుంది. తన ఐదేళ్ల పాలనలో చంద్రబాబు తీసుకున్న సంచలన నిర్ణయా లు అనేకన్నా.. కూడా అనుసరించిన నిర్ణయాలు అంటే బెటరనే విశ్లేషకులు అప్పట్లో కనిపించారు. నిజమే.. ఎక్కడో తెలంగాణలో రైతు భరోసా కార్యక్రమం చేపడితే.. ఇక్కడ రైతులకు కార్యక్రమాలు చేపట్టారు. అక్కడ ఏదైనా మార్పు తీసుకువస్తే.. ఏపీలోనూ మార్పులు చేశారు.
ఇలా చంద్రబాబు తన హయాంలో ఇతర రాష్ట్రాల నుంచి అనుసరించిన, అనుకరించిన పథకాలే మనకు ఎక్కువగా కనిపిస్తాయి. కానీ, ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్.. తీసుకుంటున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న పథకాలు.. వంటివి ఒక్క ఏపీకే పరిమితం కాలేదు.. ఏపీని చూసి.. పక్కరాష్ట్రాలు కూడా నేర్చుకుంటున్నాయి. స్థానికతకు పెద్దపీట వేసిన జగన్‌పై చంద్రబాబు అండ్ కోలు తీవ్ర విమర్శలు గుప్పించారు. స్థానికంగా ఉండే యువతకే పరిశ్రమలు, కంపెనీల్లో 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలన్న జగన్ నిర్ణయాన్ని తప్పుబట్టారు.
అదే సమయంలో సచివాలయ వ్యవస్థను తీసుకు వచ్చి లక్షల్లో ఉద్యోగాలు కల్పించడాన్ని కూడా జీర్ణించుకోలేక పోయారు. కానీ, ఇవి కాపీకొట్టిన కార్యక్రమాలు కావు. వీటిలో ప్రజానాడి ఉంది. అందుకే ఇవి దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లోనూ మన్ననలు పొందుతున్నాయి. ఇప్పటికే 75 శాతం స్థానిక ఉద్యోగుల అంశాన్ని కర్ణాటక అందిపుచ్చుకుని అమలు చేసింది. అదేవిధంగా తమి ళనాడు, ఒడిసా, పంజాబ్, ఛత్తీస్‌గఢ్‌లలో సచివాలయ వ్యవస్థలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. దీనివల్ల రెండు రకాల ప్రయోజనాలు ప్రభుత్వానికి, అధికారంలో ఉన్న పార్టీకి మేలు జరుగుతుందన్నది వాస్తవం.
ఒకటి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు నేరుగా ప్రజలకు చేరడం, రెండు.. పెద్ద ఎత్తున యువతకు ఉపాధి లభించడం. దీంతో జగన్ నిర్ణయాలను ఆయా రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. ఇక, ఇప్పుడు హరియాణా రాష్ట్రం కూడా జగన్ బాటలో నడిచేందుకు రెడీ అయింది. అక్కడ కూడా స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు కల్పించేలా చట్టం తీసుకువచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. సో.. దీనిని గమనించిన వారు.. బాబూ చూశారా? జగన్ బాటలో మరో రాష్ట్రం! అంటున్నారు.