తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది హీరోయిన్ కాజల్ అగర్వాల్. అయితే ఈ మధ్య వివాహమై ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఆమె శరీరంలో పలుమార్పులు వచ్చాయని తన స్వయంగా ఇంస్టాగ్రామ్ లో ఎన్నోసార్లు తెలియజేసింది. అంతేకాకుండా తిరిగి సినిమాలలో నటించేందుకు కూడా పలు వర్క్ అవుట్ లు చేస్తూ చాలా కష్టపడుతోందని చెప్పవచ్చు. ముఖ్యంగా పూర్వ వైభవం రావడానికి కాజల్ అగర్వాల్ చేస్తున్న పనికి అభిమానుల సైతం ఫిదా అవుతున్నారు. ఈ నేపథ్యంలో కాజల్ గురించి ఒక విషయం వైరల్ గా మారుతోంది. వాటి గురించి తెలుసుకుందాం.
ఏ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లు అందంగా కనిపించడం కోసం పలు సర్జరీలు చేయించుకుంటూ ఉంటారు. ఇలా ఇప్పటివరకు ఎంతో మంది హీరోయిన్లు పెదాలు, ముక్కు, శరీరం కొన్నిచోట్ల సర్జరీ చేయించుకున్న వారు ఉన్నారు. ఇక మొన్నటికి మొన్న సమంత కూడా సర్జరీ చేయించుకుందని వార్తలు బాగా వినిపించాయి. ఇప్పుడు తాజాగా ఆ లిస్టులోకి కాజల్ కూడా చేరిపోయింది అని వార్తలు ఇండస్ట్రీలో చాలా వినిపిస్తున్నాయి. కాజల్ అగర్వాల్ ఈ మధ్య కొన్ని ఫోటోలు షేర్ చేయగా అందులో కాస్త తేడా కనిపిస్తోందని సైతం సందేహ పడుతున్నారు నేటిజెన్లు.
అందుచేతనే కాజల్ అగర్వాల్ ముఖంలో గతంలో ఉన్న స్పార్క్ లేదంటూ కామెంట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆమె పెదాలు పూర్తిగా మారిపోయాయి. దీంతో కాజల్ అగర్వాల్ లిప్ సర్జరీ చేయించుకుందనే వార్తలు చాలా వైరల్ గా మారాయి. ముఖం కాస్త బొద్దుగా మారడం తో పాటు లిప్ కూడా కొంచెం ఉబ్బెత్తుగా కనిపించేలా సర్జరీ చేయించుకుందని వార్తలు ఇండస్ట్రీలో బాగా వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలలో నిజం ఎంతుందో తెలియదు కానీ.. కాజల్ రీ ఎంట్రీ కోసం బాగానే కసరస్తులు చేస్తోందని చెప్పవచ్చు.