ఇటువంటి వెండింగ్‌ మెషీన్‌ ని మీరు ఎప్పుడైనా చూసారా..?

-

మామూలుగా వెండింగ్‌ మెషీన్‌ అంటే కావాల్సిన వస్తువులను అందిస్తుంది. కానీ ఖాళీ ప్లాస్టిక్‌ బాటిళ్లు, ఉపయోగపడని వస్తువులను తీసుకుని ఈ మెషీన్‌ వాటికి బదులుగా డబ్బు లేదా కూపన్లను ఈ రివర్స్‌ వెండింగ్‌ యంత్రాలు అందిస్తాయి. ఇటువంటి మెషీన్లని భారతీయ రైల్వే స్టేషన్ల లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా ఇటువంటి వాటిని అనేక చోట్ల పెట్టడం జరిగింది. వీటి వల్ల కలిగే ఉపయోగాలు ఏమిటి అనే విషయానికి వస్తే..

vending machine

ఈ రివర్స్ వెండింగ్ మెషీన్ల వల్ల వాడేసిన వస్తువుల్ని ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా మిషన్ కలెక్ట్ చేసుకుని రీసైకిల్ కి ఉపయోగపడుతుంది. నిజంగా ఇది ఎంత గొప్ప ఆలోచనో కదూ….! ఇవి ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారాయి. ఈ మెషీన్‌ మొత్తం నోట్లతో నిండి ఉంది. ఒక మనిషి ఆ మెషీన్‌ కి ఎదురుగ నిలబడడం… యంత్రంలో ఉన్న నిర్దేశిత స్లాట్‌ లో అతను కూల్‌ డ్రింక్‌ క్యాన్‌ను పెట్టడం ఇందులో కనిపిస్తోంది.

ఆ తరువాత మనకి సంబందించిన నెంబర్ ని టైపు చేసాక డబ్బులు అందులో నుండి రావడం జరుగుతుంది. ఈ వీడియో కి ఏకంగా నాలుగున్నర లక్షల వ్యూస్‌ వచ్చాయి. దీని వల్ల పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుంది అని నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిజంగా ఇది మంచి విషయం. దీని కారణంగా పర్యావరణం మెరుగు పడుతుంది కదా..!

Read more RELATED
Recommended to you

Exit mobile version