ఖైరతాబాద్ గణేశుడిని చూశారా.. ఈ “శ్రీ విశ్వశాంతి మహాశక్తి” అవతారంలో

-

నేడు వినాయక చవితి కావడంతో పండగ వాతావరణం నెలకొంది. హైదరాబాద్ లోని ఖైరతాబాద్ గణేశుడు భక్తులకు దర్శనం ఇవ్వడానికి రెడీ అయ్యాడు. ఈ సంవత్సరం “శ్రీ విశ్వశాంతి మహాశక్తి” గణపతిగా ఖైరతాబాద్ గణేశుడు దర్శనం ఇవ్వనున్నాడు. ఉదయం 6 గంటలకు గణేశుడి మొదటి పూజ నిర్వహించారు. పది గంటలకు కలశపూజ, ప్రాణ ప్రతిష్ట ఉండనుంది. ఈ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ హాజరు కాబోతున్నారు.

Khairatabad Maha Ganapati 2025
Khairatabad Maha Ganapati 2025

అనంతరం 69 అడుగుల ఎత్తైన విగ్నేశ్వరుడి దర్శనానికి భక్తులకు అనుమతి ఇస్తారు. తొమ్మిది రోజుల పాటు ఖైరతాబాద్ గణేశుడు పూజలు అందుకొనున్నారు. ఖైరతాబాద్ గణేశుడిని చూడడానికి కోట్లాది సంఖ్యలో భక్తులు తరలివస్తారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఖైరతాబాద్ గణేశుడిని చూడడానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ప్రత్యేకమైన చర్యలను చేపడుతున్నారు. కాగా, కొన్ని మండపాలలో విఘ్నేశ్వరుడిని ప్రతిష్టించి పూజలు నిర్వహించడం ప్రారంభించారు. వీధులలో, ఇంట్లో సందడి వాతావరణం నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news