సెప్టెంబర్ మొదటివారంలో పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల కాబోతున్నట్లుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓ ప్రకటనలో తెలియజేశారు. పంచాయతీల అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలియజేశారు. రూ. 1,120 కోట్ల విడుదలకు హామీ ఇచ్చిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఆర్థిక సంఘం నిధులను పంచాయతీలకు వినియోగిస్తూ కనీస మౌలిక వసతులు, సేవలు అందించాలన్నదే తమ ఉద్దేశం అని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాలలో బిజీగా గడుపుతున్నారు. ఏపీలో అనేక రకాల సంక్షేమ పథకాలను తీసుకువస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీని అనేక విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నారు.