కీర‌దోస చేదుగా ఉందా? ఇలా చేయండి.. వైర‌ల్ టిక్‌టాక్‌ వీడియో..!

-

కీర‌దోస‌లు మ‌న‌కు ఎన్నో ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాల‌ను క‌లిగిస్తాయి. ముఖ్యంగా వేస‌విలో వీటిని ఎక్కువ‌గా తింటుంటారు. అయితే కొన్ని సంద‌ర్భాల్లో మాత్రం మ‌న‌కు చేదు క‌లిగిన కీర‌దోస‌లు తార‌స‌ప‌డుతుంటాయి. చూసేందుకు కొన్ని బాగానే ఉంటాయి. కానీ క‌ట్ చేసి తింటే మాత్రం.. క‌టిక చేదు త‌గులుతాయి. అయితే ఆ చేదుద‌నాన్ని వాటి నుంచి వ‌దిలించుకునేందుకు ఓ ట్రిక్ ఉంది. అదేమిటంటే..

టిక్‌టాక్‌లో ఓ మ‌హిళ కీర‌దోస‌ల్లో ఉండే చేదును పోగొట్టే ఓ చిట్కాను తెలియ‌జేసింది. అందుకు ఏం చేయాలంటే.. కీర‌దోస పై భాగంలో స‌గానికి క‌ట్ చేసి కింది భాగంపై పై భాగంతో రుద్దాలి. దీంతో ఆ ముక్క‌ల నుంచి తెల్ల‌ని ద్ర‌వం బ‌య‌ట‌కు వ‌స్తుంది. దీంతో కీర‌దోస‌లో ఉండే చేదు పోతుంది. అలాగే కీర‌దోస తాజాగా మారుతుంది. వాటిని తిన‌వ‌చ్చు.

@basicallyperkfect

milking a cucumber?#healthheroes #kitchenhacks #cucumber #fyp

♬ original sound – basicallyperkfect

కాగా టిక్‌టాక్‌లో ఆ మ‌హిళ పెట్టిన పోస్టు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. అయితే మీ వ‌ద్ద కూడా చేదు ఉన్న కీర‌దోస ఉంటే ప‌డేయ‌కండి. వాటిని పైన తెలిపిన విధంగా చేసి చూడండి. చేదు త‌గ్గేదీ, లేనిదీ తెలుస్తుంది..!

Read more RELATED
Recommended to you

Exit mobile version