ఇంట్లో వాస్తు దోషాలు, నెగెటివ్ ఎనర్జీ ఉంటే.. ఇంట్లో ఉన్న వారందరికీ ఎప్పుడూ ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. ముఖ్యంగా అలాంటి ఇంట్లో సంపాదించేవారు ఉంటే డబ్బు ఎంత సంపాదించినా ఖర్చవుతూనే ఉంటుంది. చేతిలో చిల్లి గవ్వ మిగలదు. పైగా అప్పులు ఎక్కువవుతాయి. దీంతో సమస్యలు అధికమవుతాయి. అయితే ఇలాంటి సమస్యలు ఎవరికైనా ఉంటే వారు వెంటనే ఇంట్లోని వాస్తు దోషాలను, నెగెటివ్ ఎనర్జీని తొలగించుకోవాల్సి ఉంటుంది. అందుకు కింద సూచించిన సూచనలు పాటించాలి.
ఫెంగ్‌షుయ్ వాస్తు ప్రకారం ఇంట్లో ఉండే వాస్తు దోషాలను, నెగెటివ్ ఎనర్జీని తొలగించాలంటే.. ఇంట్లో లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ఉత్తరం, పడమర దిక్కుల మధ్యలో ఉంచాలి. దీని వల్ల కష్టాలు దూరమవుతాయి. ధనం సమృద్ధిగా లభిస్తుంది. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఇంట్లో ఉన్న వారందరూ సంతోషంగా ఉంటారు.
చైమ్ బెల్స్‌ను ఇంట్లో వేలాడదీయాలి. గాలి వచ్చినప్పుడు అవి ఊగుతూ చిన్నపాటి శబ్దాలను చేస్తుంటాయి. దీంతో ఆ ధ్వనికి ఇంట్లో ఉండే నెగెటివ్ ఎనర్జీ పోతుంది. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. సమస్యలు ఉండవు.
ఎంత ప్రయత్నం చేసినా ఉద్యోగం రాని వారు, ఆర్థిక సమస్యలు ఉన్నవారు బంగారు కాయిన్లతో నిండిన షిప్ బొమ్మను ఇంట్లో ఉంచుకోవాలి. దీంతో చేపట్టే ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. ఈ బొమ్మలు మార్కెట్‌లో మనకు దొరుకుతాయి.
ఫెంగ్ షుయ్ వాస్తు ప్రకారం చైనా కాయిన్స్ స్థిరమైన ఆదాయాన్ని తెచ్చి పెడతాయి. అందువల్ల ఎరుపు రంగు రిబ్బన్‌లో వాటిని ఉంచి చుట్టాలి. అనంతరం ఆ మూటను ఇంట్లో పెట్టుకోవాలి. దీంతో ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఇవి కూడా మనకు మార్కెట్‌లో లభిస్తాయి.
క్రిస్టల్ గ్లోబ్‌ను ఇంట్లో పెట్టుకోవడం ద్వారా ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. దీంతో అన్ని సమస్యలు పోతాయి.
ఇంటి ప్రధాన ద్వారానికి పై భాగంలో గుర్రపు నాడాను ఎవరికీ కనిపించకుండా అమర్చాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో అందరికీ రక్షణ లభిస్తుంది. ధనం, ఆరోగ్యం కలుగుతాయి.
లోహపు తాబేలు బొమ్మను ఇంట్లో ఉంచుకోవడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి బయట పడవచ్చు. ఇంట్లో ఉండే వాస్తు దోషాలు కూడా పోతాయి. ఇంట్లోని వారి జీవితాల్లో సంతోషం నెలకొంటుంది. ఆ బొమ్మను ఇంట్లో ఉత్తర దిశగా ఉంచాలి. డ్రాయింగ్ రూం ఉంటే ఆ గదిలో ఉత్తర దిక్కున ఈ బొమ్మను పెట్టాలి.